Minister Narayana: చైనా తరహాలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు..! 4 d ago
చెత్త పేరుకుపోకుండా చైనా తరహాలో విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. పుష్కరాలు, రాజమహేంద్రవరం అభివృద్ధిపై సీఎం చంద్రబాబుతో సమీక్షిస్తామని పేర్కొన్నారు. మూడేళ్లలో రాజధాని అమరావతి పనులను పూర్తి చేస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పన్నులు పెంచిందని, ప్రభుత్వ నిధులను దారి మళ్లించిందని విమర్శించారు.